యష్ ది మంచి నిర్ణయమే!

Yash

‘కేజీఎఫ్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో దూసుకొచ్చారు కన్నడ హీరో యష్. మూడేళ్ళ క్రితం యష్ కేవలం కన్నడ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం. ఇప్పుడు ఇండియాలో అతని పేరు తెలియని ప్రేక్షకుడు ఉండడు.

‘కేజీఎఫ్’ విడుదలై ఎనిమిది నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఈ హీరో తన తదుపరి చిత్రం ఏంటనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఇన్నాళ్లకు ఒక విషయం చెప్పాడు. “‘కేజీఎఫ్ 3 గురించి అందరూ అడుగుతున్నారు. అది ఇప్పట్లో ఉండదు అని స్పష్టం చెయ్యాలనుకుంటున్నా. రెండు, మూడు వేరే సినిమాలు చేశాక అప్పుడు ‘కేజీఎఫ్ 3’ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు అయితే ఆ సినిమా ఉండదు,” అని క్లారిటీ ఇచ్చారు యష్.

యష్ తీసుకున్న నిర్ణయం మంచిదే. కేవలం ‘కేజీఎఫ్’ స్టార్ గానే గుర్తింపు తెచ్చుకుంటే ఆయనకి మున్ముందు కష్టమే.

రికార్డులు ఎక్కువ కాలం ఉండవు. ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సిందే. బాహుబలి 2 రికార్డులను నాలుగేళ్లకే ‘కేజీఎఫ్ 2’, కాంతారా (కర్ణాటక), ‘విక్రమ్’ (తమిళనాడులో), ఆర్ ఆర్ ఆర్ (ఏపీ, తెలంగాణాలో) బ్రేక్ చేశాయి. సో, యష్ తన మార్కెట్ ని మరింత పెంచుకునేందుకు మరిన్ని వైవిధ్యమైన, భారీ చిత్రాలు చేయాలనుకుంటున్నాడు.

 

More

Related Stories