శకుంతల స్థానంలో యశోద!

Samantha


నవంబర్ 4న ‘శాకుంతలం’ విడుదల చేస్తామని దిల్ రాజ్ ప్రకటించడంతో సమంతతో సినిమా నిర్మించిన ‘యశోద’ మేకర్స్ తమ సినిమా పబ్లిసిటీని బంద్ చేశారు. దీపావళికి ‘యశోద’ని విడుదల చేద్దామనుకున్న వారి ప్లాన్ మారిపోయింది. ఐతే, ‘శాకుంతలం’ గ్రాఫిక్స్ పనులు జాప్యం కానున్నాయి అని గ్రహించిన మేకర్స్ వెంటనే తమ సినిమా రిలీజ్ ని ఆపేశారు. వచ్చే ఏడాది రిలీజ్ చేద్దామనుకుంటున్నారట.

దాంతో, ‘యశోద’ సినిమా మళ్ళీ లైన్ లోకి వచ్చింది. నెల రోజుల పాటు అమెరికా వెళ్లి వచ్చిన సమంత కూడా సినిమా ప్రొమోషన్ కి వస్తానని మాటివ్వడంతో ఇక రిలీజ్ కి రెడీ అవుతోంది. ‘శాకుంతలం’ స్థానంలో ‘యశోద’ రానుంది. వచ్చే నెలలోనే విడుదల కానుంది యశోద.

సమంత ఇక మీడియాని ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే, ఆమె అమెరికా పర్యటనపై అనేక పుకార్లు ఉన్నాయి. స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లి వచ్చింది అనేది పుకారు. అలాగే, ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రశ్నలు ఎదురవుతాయి. మరి, సమంత ఎలా హ్యాండిల్ చేస్తుందనేది చూడాలి.

 

More

Related Stories