బండ్ల మాటల్లో నిజమెంత?

Bandla Ganesh

పవన్ కల్యాణ్ ను తన దేవుడిగా చెప్పుకుంటాడు బండ్ల గణేష్. అలాంటి “దేవుడి” నుంచి వరం అందుకున్నాడు బండ్ల. ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. దీంతో బండ్ల ఆనందానికి అవధుల్లేవు. రేపే సెట్స్ పైకి వెళ్లిపోతున్నాం అనేంత సంబరపడిపోతున్నాడు. కానీ దేవుడు వరమైతే ఇచ్చాడు కానీ ఆ వరం అమల్లోకి రావడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది.

“వకీల్ సాబ్” తో రీఎంట్రీ ఇస్తున్నాడు పవన్. ఆ సినిమానే ఇంకా కంప్లీట్ కాలేదు. అంతలోనే క్రిష్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు. అది జస్ట్ ఇలా స్టార్ట్ అయి అలా ఆగింది. ఆ వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది.

ఇలా కన్ ఫర్మ్ అయిన సినిమాలే మూడున్నాయి. ఇవి కాకుండా రామ్ తళ్లూరి బ్యానర్ పై పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మధ్యలో అయ్యప్పనుమ్ కోషియమ్ అనే రీమేక్ పై కూడా చర్చలు సాగుతున్నట్టు టాక్.

ఇన్ని సినిమాలు లైన్లో ఉన్న టైమ్ లో బండ్లకు సినిమా చేసి పెడతానని హామీ ఇచ్చాడు పవన్. మాటిచ్చారు కాబట్టి ఎప్పటికైనా సినిమా చేస్తాడు. కాకపోతే అది రెండేళ్లకా.. మూడేళ్లకా.. లేక వచ్చే ఎన్నికల తర్వాత అనే విషయం ఎవరి చేతిలో లేదు. అప్పటివరకు బండ్ల గణేశ్ వెయిట్ చేయాల్సిందే. పవన్ లైనప్ మధ్యలో దూరే పరిస్థితి లేదు.

Related Stories