యంగ్ డైరెక్టర్స్ మెచ్చిన ‘మసూద’

‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి భిన్నమైన సినిమాలు తీసి రాహుల్ యాదవ్ నక్కా అభిరుచి ఉన్న నిర్మాత అనిపించుకున్నారు. ఆయన నిర్మించిన మూడో చిత్రం… మసూద. నవంబర్ 18న విడుదలవుతోంది. ఈ సినిమాని ప్రత్యేకంగా తిలకించిన యువ దర్శకులు సినిమాని తెగ మెచ్చుకున్నారు.

చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్

మేం సినిమాను జెన్యూన్‌గా తీశాం. టెర్రిఫిక్, హారిఫిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాను చూడండి. సినిమా మీకు నచ్చుతుంది అని మా నమ్మకం.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్

సరైన హారర్ సినిమాగా మసూద వస్తోంది. ఇలాంటి చిత్రాలను థియేటర్లో చూస్తేనే థ్రిల్ ఫీలింగ్ వస్తుంది. మేం సినిమాను చూస్తూ ఎంత ఎంజాయ్ చేశామో మీరు చూసినపుడు మీకు కూడా అర్థమవుతుంది.

కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్

మళ్లీ రావా, ఏజెంట్ చిత్రాల తరువాత రాహుల్ ఎలాంటి సినిమా తీస్తారో అనుకున్నాను. హారర్ సినిమా అని చెప్పినప్పుడు.. రొటీన్ అని అనుకున్నాను. కానీ సినిమా చూసిన తరువాత షాక్ అయ్యాను. చాలా చోట్ల కచ్చితంగా భయపడతాం. డెబ్యూ డైరెక్టర్‌ తీసిన సినిమాగా అనిపించదు. మ్యూజిక్, సౌండ్, కెమెరా అన్నీ చక్కగా కుదిరాయి.

వెంకటేష్‌ మహా

హారర్ జానర్‌ తీయాలనే ఇంట్రెస్ట్ లేదని ఇప్పుడున్న దర్శకులు అంటున్నారు. నేను కూడా అన్నాను. కానీ నేను ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశాను. హారర్‌ను ఫుల్లుగా ఎక్స్‌పీరియెన్స్ చేశాను. చాలా భయపడ్డాను. ఇది విజువల్ హారర్ ఫిల్మ్. సౌండింగ్, మ్యూజిక్ పరంగానూ అద్భుతంగా పని చేశారు. హారర్ అంటే కామెడీ, మసాలా ఉండాలని అనుకునే సమయంలో.. ఇలాంటి కథను నిర్మించిన రాహుల్‌కు థాంక్స్.

మిడిల్ క్లాస్ మెలోడిస్ డైరెక్టర్ వినోద్

ప్రస్తుతం హారర్ ఫార్మాట్ రొటీన్ అయింది. అందులోనూ కొత్త ఎలిమెంట్, పాయింట్ తీసుకోవడం బాగుంది. దెయ్యాన్ని చూస్తే వచ్చే భయం కాదు. ఆ సీన్‌లోంచి, వాతావరణంలోంచి భయాన్ని క్రియేట్ చెయ్యటం మామూలు విషయం కాదు. సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల్లోనే భయపెట్టేస్తాడు. ఇదేదో తేడాగా ఉందే అనే భయం కలుగుతుంది.

వివేక్ ఆత్రేయ

రాహుల్, ప్రశాంత్ విహారి నాకు మంచి ఫ్రెండ్స్. అమ్మోరు, కాంతారా ప్రపంచంలో మనం ఉన్నప్పుడు.. పాత్రలకు ఏమైనా జరుగుతూ ఉంటే మనం భయపడుతుంటాం. ఈ చిత్రంలోనూ అలాంటి ఫీలింగ్ వస్తుంది. హారర్ సినిమా చేయాలంటే టెక్నికల్‌గా ఎంతో నాలెడ్జ్ ఉండాలి. సాయి మొదటి సినిమానే ఇలా చేయడం చాలా గ్రేట్. బెలూన్ సౌండ్‌కి కూడా నా గుండె ఝల్లుమంది. రాత్రి ఇంటికి వెళ్లి ఒంటరిగా భోజనం చేయాలన్నా కూడా భయంగా అనిపించింది. హారర్ సినిమాకు ఆర్ఆర్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆర్ఆర్, విజువల్స్ అద్భుతంగా అనిపిస్తుంది. థియేటర్లోనే చూస్తేనే ఈ ఫీలింగ్ వస్తుంది.

Advertisement
 

More

Related Stories