టైమిచ్చిన టైగర్

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ సినిమా ఎంట్రీకి అంతా సిద్ధమైంది. “వార్ 2” సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు ఎన్టీఆర్. బాలీవుడ్ అగ్ర నటుడు హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తారు. ఇప్పటికే హృతిక్ రోషన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఇక ఎన్టీఆర్ కూడా షూటింగ్ కి టైం ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ ది చిన్న పాత్ర కాదు. హృతిక్ రోషన్ కి సమానంగా ఉండే పాత్ర. అంటే ఫుల్ లెంగ్త్ లో డేట్స్ ఇవ్వాలి.

హృతిక్ రోషన్ ఈ సినిమాకి 100 రోజుల డేట్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ కూడా 60 నుంచి 80 రోజుల డేట్స్ ఇస్తారు. ఏప్రిల్ నెలాఖరులో ఎన్టీఆర్ “వార్ 2” షూటింగ్ లో పాల్గొంటారు. ఆగస్టునాటికి మొత్తం వర్క్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత “దేవర 2” కానీ మరో సినిమా కానీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అనుకున్న చిత్రం ఆలస్యం అవుతోంది. నీల్ “సలార్ 2” తీసే ప్లాన్ లో ఉన్నారు. సో ఎన్టీఆర్ – నీల్ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కావొచ్చు.

Advertisement
 

More

Related Stories