
నాగ శౌర్య సరసన “రంగబలి” అనే చిత్రంలో నటించింది యుక్తి తరేజా. ఆ సినిమాలో కాస్త హాట్ హాట్ గానే నటించింది. సినిమా ఆడలేదు కానీ ఆమె అందచందాల షోకి మంచి అవకాశాలు వస్తాయని భావించారు. కానీ అలా జరగలేదు. ఎనిమిది నెలలు ఖాళీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక ఆఫర్ వచ్చింది.
నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమాలో దీక్షిత్ శెట్టి ఒక కీలక పాత్ర పోషించాడు. అతను ఒక హీరోగా, దసరా దర్శకుడు సోదరుడు శశి ఓదెల మరో హీరోగా ఒక కొత్త సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ చిత్రంలో కింగ్‌గా దీక్షిత్ శెట్టి, జాకీగా శశి ఒదెలా, క్వీన్‌గా యుక్తి తరేజా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి #KJQ కింగ్ – జాకీ – క్వీన్ అనే టైటిల్‌ను పెట్టారు.
మరి ఈ సినిమాతోనైనా యుక్తి విజయం అందుకుంటుందా అనేది చూడాలి.