డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి జీ తెలుగు

Solo Brathuke So Better

ఆర్థిక కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న జీ గ్రూప్, కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడుతోంది. ఇప్పటికే జీ5 అనే ఓటీటీని స్థాపించి, దానికోసం కళ్లుచెదిరేలా నిధులు కుమ్మరిస్తున్న ఈ సంస్థ.. ఇప్పుడు మరిన్ని కొత్త అవకాశాల కోసం వెదుకుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జీ-ప్లెక్స్ లాంఛ్ చేసింది. కొత్త సినిమాల్ని పే-పర్-వ్యూ (నిర్ణీత మొత్తం చెల్లించి సినిమా చూసే విధానం) కింద జీ-ప్లక్స్ లో స్ట్రీమింగ్ కు ఉంచుతోంది.

ఇప్పుడు వీటికి అదనంగా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లోకి కూడా ఎంటరైంది జీ గ్రూప్.

తెలుగులో మరోసారి డిస్ట్రిబ్యూషన్ లోకి ఎంటరైంది జీ గ్రూప్. ఈ మేరకు కొన్ని సినిమాల కాపీరైట్ హక్కుల్ని దక్కించుకునే ప్రాసెస్ లో ఉంది. ఇందులో భాగంగా తొలి ప్రయత్నంగా సాయితేజ్ నటించిన “సోలో బ్రతుకే సో బెటర్” సినిమాను దక్కించుకుంది. ఏపీ-తెలంగాణలో ఈ సినిమాను స్వయంగా జీ గ్రూప్ విడుదల చేయబోతోంది.

జీ గ్రూప్ కు నిర్మాణం-డిస్ట్రిబ్యూషన్ కొత్త కాదు. దాదాపు 12 ఏళ్ల కిందటే తెలుగులో సినిమాలు నిర్మించింది ఆ సంస్థ. శివాజీ హీరోగా అప్పట్లో ‘మస్త్’ అనే సినిమాతో పాటు మరో 2 మూవీస్ కూడా తీసింది. అయితే అప్పట్లో జరిగిన కుంభకోణాలు, నష్టాల కారణంగా ఆ సెగ్మెంట్ నుంచి వైదొలిగింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతోంది. బాలీవుడ్ లో మాత్రం జీ స్టుడియోస్ పేరిట స్ట్రాంగ్ నెట్ వర్క్ ఉంది ఈ సంస్థకు.

మళ్లీ ఇన్నేళ్లకు సాయితేజ్ సినిమాతో బోనీ కొట్టాలని చూస్తోంది జీ గ్రూప్. కరోనా పరిస్థితులన్నీ చల్లారిన తర్వాత ఓ మంచి డేట్ చూసి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని చూస్తోంది. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ లో “సోలో బ్రతుకే సో బెటర్” మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. 

Related Stories