Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ప్రభాస్ తో ఆ ఇబ్బంది ఉంది: నిధి

TeluguCinema, December 27, 2025December 27, 2025
Nidhhi Agerwal

నిధి అగర్వాల్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె ఒక ఈవెంట్ కి వెళ్తే జనం ఎగబడ్డారు. ఆమెని చుట్టుముట్టి తాకేందుకు ప్రయత్నించారు. ఆ సంఘటన తర్వాత నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి కొన్ని కామెంట్స్ చెయ్యడం, అతనికి ఘాటుగా నిధి బదులు ఇవ్వడం జరిగింది. ఐతే, ఈ వివాదం గురించి కాకుండా త్వరలో విడుదల కానున్న తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడేందుకు ఇష్టపడతాను అంటోంది.

ప్రభాస్ నిజ జీవితంలో కూడా డార్లింగ్!

ఆమె ప్రభాస్ సరసన నటించిన మొదటి చిత్రం… ది రాజా సాబ్. ప్రభాస్ లాంటి హీరోలను, మనుషులను మరెక్కడా చూడలేదు అని చెప్తోంది నిధి.

ప్రభాస్ ని అందరూ డార్లింగ్ అని పిలుస్తారు. నిజంగానే ఆయన డార్లింగ్. నిజజీవితంలో కూడా ఎంతో మంచి మనిషి. ఆయనలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. నేను ఐతే అంత మంచి వ్యక్తులను ఇంకెక్కడా చూడలేదు. అతిథి మర్యాదలు అయినా, సెట్ లో ప్రవర్తించే విధానం అయినా, ఎదుటి వారిని గౌరవించే పద్దతి కానీ అన్నీ ప్రత్యేకం. తోటి నటుల కోసమే ఇంటి ప్రత్యేకంగా భోజనం తెప్పిస్తారు,” అంటూ ప్రభాస్ మంచితనం గురించి పొగిడేసింది ఈ భామ.

ప్రభాస్ తో ఆ ఇబ్బంది ఉంది!

“ది రాజాసాబ్” సినిమాలో నిధి అగర్వాల్ ఒక హీరోయిన్. మాళవిక, రిద్ధి కుమార్ కూడా హీరోయిన్లుగా నటించారు. ఐతే ప్రభాస్ తో నటించడంలో ఒక ఇబ్బంది ఉంది అని పేర్కొంది ఈ భామ.

Nidhhi Agerwal

“ప్రభాస్ చాలా పొడగరి. 6.2 అడుగుల హైట్ అంటే మామూలు పొడుగు కాదు. నేను ఏమో 5.7 అడుగులు. ఆయన సరసన ఫ్రేమ్ లో నన్ను బ్యాలెన్స్ చేయడం కోసం పెద్ద హీల్స్ వేసుకున్నాను. అయినా మ్యాచ్ కాలేదు. దాంతో సెట్ లో యాపిల్ బాక్స్ లు వేసి నిల్చుండబెట్టారు క్లోజ్ సీన్ల కోసం. ఒక హీరోతో ఇలా హైట్ విషయంలో ఇబ్బంది పెద్దది ఇదే,” అని ఆమె చెప్పింది.

2025లో సంతృప్తి!

2025లో ఆమె రెండు సినిమాలు విడుదల అవుతాయి అని భావించింది. కానీ ఒక్క “హరి హర వీరమల్లు” మాత్రమే విడుదలయింది. అది కూడా ఆడలేదు. అయినా 2025 కెరీర్ పరంగా సంతృప్తిని ఇచ్చింది అని చెప్తోంది.

“పవన్ కళ్యాణ్ గారితో నటించడం, ఆయన నుంచి ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషం కలిగించింది. ఇక ప్రభాస్ తో 2025లో సినిమా పూర్తి చెయ్యడం కూడా సంతృప్తినిచ్చింది. 2026లో నేను అనేక కొత్త ప్రాజెక్ట్స్ తో రానున్నాను. అవన్నీ ఈ ఏడాది సైన్ చేశాను. సో, ఆ విధంగా 2025 నాకు చాలా ఇచ్చింది,” అని నిధి వివరించింది.

అన్ని రకాలు ఇష్టమే!

కేవలం గ్లామర్ పాత్రలే కాదు ఎలాంటి రోల్స్ చెయ్యడానికి అయినా సిద్ధం అని అంటోంది. అలాగే OTT వెబ్ సిరీస్ లు కూడా చేస్తాను అని తెలిపింది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ

Recent News

  • సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • సుతారంగా క్లాస్ పీకిన Anasuya Bharadwaj
  • పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Janhvi Kapoor: ‘పెద్ది’లో రెండున్నర నిమిషాలు తొలగింపు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes