
విక్రమ్ హీరోగా దర్శకుడు శంకర్ “ఐ”(I) అనే తీశాడు. Beauty and the Beast అనే ఫెయిరీ టైల్ ఆధారంగా శంకర్ ఈ సినిమా తీయగా అందులో బీస్ట్ అవతారంలో విక్రమ్ కనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో రాక్షసుడిలా, జంతువుని పోలిన మనిషిగా, కురూపిగా రకరకాలుగా కనిపించాడు విక్రమ్.
ఇప్పుడు అల్లు అర్జున్ “రాకా” (Raaka) అనే చిత్రంలో అచ్చం విక్రమ్ లానే కనిపిస్తున్నాడు. సగం గుండు, చేతులకు జంతువులకు ఉండే గోళ్లు, ముఖం మనిషి రూపం….ఇలా ఉంది అల్లు అర్జున్ పాత్ర లుక్. దాంతో, ఇది “ఐ” సినిమాలా ఉందే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కానీ “రాకా”కి విక్రమ్ “ఐ”కి సంబంధం లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇది ఒక పాత్ర లుక్. మరో పాత్ర సాధారణంగానే ఉంటుంది. ఈ సినిమా కథలో రకరకాల జంతువులు, లోకాలు మిళితమై ఉంటాయి. ఇప్పటివరకు ఇండియన్ సినిమా మీద చూడని కథని తీస్తున్నారు అని టాక్.
హెవీ గ్రాఫిక్స్ తో తీస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు పాత్రలు కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయట.
