
ఇటీవలే నారి నారి నడుమ మురారి, బైకర్ వంటి సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చిన హీరో శర్వానంద్ (Sharwanand) మరో సినిమాని తీసుకొస్తున్నాడు. ‘భోగి’ (Bhogi) అనే చిత్రంలో నటిస్తున్నాడు.
శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది తొలిసారిగా కలిసి సినిమా చేస్తున్నారు. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా 1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంగా సాగుతుంది.
అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇప్పుడు రాజమండ్రిలో అత్యంత కీలకమైన షెడ్యూల్‌ను ప్రారంభించింది టీం. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈ సన్నివేశాలను ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో తీస్తున్నారు.
“ఎ బ్లడ్ ఫెస్ట్” అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న ‘భోగి’ చిత్రంలో శర్వానంద్ ఒక సరికొత్త అవతార్ లో కనిపిస్తున్నారు. ఆగస్ట్ 28, 2026న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.
