Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Deewana: 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు

TeluguCinema, June 26, 2026June 26, 2026
Deewana team

హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది.

డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి: సినిమానే జీవితం అనుకున్నా. దీవాన సినిమా అవకాశం కల్పించడం ద్వారా నాకు జీవితాన్ని ఇచ్చారు ప్రొడ్యూసర్స్ వాసు, శ్రీదేవి. దీవాన మూవీని బ్యాడ్ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. ఆ టైమ్ లో నాకు ఏమీ కాని మీడియా మిత్రులు సపోర్ట్ గా నిలిచారు. ఏ భాషలో రాని సినిమా ఇది. మీరంతా బిగ్ స్క్రీన్ లో మూవీ చూస్తేనే నాకు ఆనందం. అన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి : “మా సినిమా థ్యాంక్యూ మీట్ కు అతిథిగా వచ్చిన శ్రీవిష్ణు గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. మూవీలో నరేష్ గారి క్యారెక్టర్ హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. నేను వాసు ప్రొడ్యూసర్స్ అవుదామని అనుకున్నప్పుడు మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వ్యక్తి అరవింద్ గారు. ఆయన మాకోసం ఉన్నారనే ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ప్రొడ్యూసర్ విద్య అక్కకు కూడా థ్యాంక్స్. మేము చాలా మంచి సినిమా చేశాం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేశాం.”

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ విద్య గారు దీవాన మూవీ గురించి బాగుందని నాకు చెప్పారు. థ్యాంక్యూ మీట్ పెడుతున్నారు అని అన్నారు. వాసు గారు గెస్ట్ గా రావాలని నన్ను ఇన్వైట్ చేశారు. దీవాన సినిమా చూశాను. చాలా బాగుంది. మూవీలో ఝాన్సీ గారు, నరేష్ గారు మిగతా కాస్టింగ్ అంతా పర్పెక్ట్ గా కుదిరింది. డీవోపీ వర్క్, మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇంటర్వెల్ పదిహేను నిమిషాల ముందు సినిమా ఒక జోన్ లోకి ఎంటర్ అయ్యింది. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ నేను చూడలేదు. ఇలా ఎందుకు చేశాడని డైరెక్టర్ మీద కోపం వచ్చింది. క్యారెక్టర్స్ మీద లవ్ ఉన్నప్పుడే మనకు కోపం వస్తుంటుంది. హర్షిత్ నటన, వాయిస్ అంటే నాకు ఇష్టం. సహజంగా నటిస్తాడు. ఇతనికి మంచి ప్రాజెక్ట్ పడితే పేరు తెచ్చుకుంటాడు అనిపించింది. ఇది లవ్ స్టోరీనే కాదు లైఫ్ గురించి చాలా డెప్త్ ఉన్న స్టోరీ. ఎంతో ఎక్సిపీరియన్స్ చేస్తే గానీ ఇలాంటి డెప్త్ ఉన్న రైటింగ్ రాదు. సెకండాఫ్ ఎలా ఉంటుంది అనుకుంటూ మూవీ చూశా. పర్ ఫార్మెన్స్ లు అన్నీ బాగున్నాయి. సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి మనకొక ఫుల్ ఫిల్ నెస్ వస్తుంది. దీవాన బ్యూటిఫుల్ ఫిలిం. ప్రతి ఒక్కరూ చూడాలి. నావంతుగా ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. రేపు శనివారం ఏపీ తెలంగాణలో ప్రతి ఊర్లో ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం. మీకు సినిమా నచ్చితే మరొకరిని థియేటర్స్ కు తీసుకెళ్లండి, లేదా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టండి. అది దీవాన సినిమాకు బూస్ట్ ఇస్తుంది. ఈ సినిమా నచ్చకుండా ఉండదు అనే కాన్ఫిడెన్స్ తో చెబుతున్నా. ఒకవేళ మీ టైమ్ వేస్ట్ అయ్యింది అనిపిస్తే చెప్పండి, నెక్ట్స్ నా సినిమా వచ్చినప్పుడు వడ్డీతో కలిపి ఇచ్చేస్తా.”

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!

Recent News

  • OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ
  • Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం
  • కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes