
‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ (Sri Gouri Priya) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ సరదా ఘటనను బయటపెట్టింది గౌరీప్రియ.
సెట్స్ లో కిరణ్-గౌరీ చాలా కలిసిపోయారంట. మంచి ఫ్రెండ్స్ అయిపోయారంట. ఎంతలా అంటే అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారట. ఈ క్రమంలో ఓరోజు సెడన్ గా డబ్బులు కావాలని గౌరీప్రియను అడిగాడంట కిరణ్. వెంటనే గౌరీప్రియ కూడా ఓకే చెప్పింది.
కిరణ్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసే క్రమంలో, కిరణ్ కుమార్ అనే ఓ క్యాబ్ డ్రైవర్ కు డబ్బులు పంపించేసిందంట. తప్పు తెలుసుకొని వెంటనే ఆ క్యాబ్ డ్రైవర్ ను సంప్రదించి, డబ్బులు వెనక్కు రప్పించుకుందంట. అలా వచ్చిన డబ్బును తిరిగి కిరణ్ అబ్బవరంకు పంపించిందంట.
థియేటర్లలోకి వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’లో కిరణ్-గౌరీప్రియ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా గౌరీప్రియ పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు వస్తున్నాయి.
