Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

New heroines: తెలుగుతెరపై కొత్త మెరుపు తీగలు

TeluguCinema, February 28, 2026February 28, 2026

అనుష్క సినిమాలు బాగా తగ్గించేసింది. సమంత అడపాదడపా సినిమాలు చేస్తోంది. వీళ్లిద్దరూ స్టార్ హీరోలకు దూరమయ్యారు. మరోవైపు శ్రీలీల సక్సెస్ లు లేక స్థావరం మార్చుకునే పనిలో ఉంది. మీనాక్షి అందరికీ కాల్షీట్లు కేటాయించలేకపోతోంది. ఇక తమన్న, రకుల్, పూజాహెగ్డే, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు ఎప్పుడో దూరమయ్యారు. 

సరిగ్గా ఈ గ్యాప్ ను భర్తీ చేసేందుకు వెండితెరపైకి దూసుకొస్తున్నాయి అందాల కెరటాలు. అందంతో పాటు నటనతో కూడా ఇండస్ట్రీ ఆకర్షిస్తున్నాయి.

ఈ లిస్ట్ లో తాజా సెన్సేషన్ మానస వారణాసి (Manasa Varanasi). కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో మెరిసిన ఈ ముద్దుగుమ్మపై ఇండస్ట్రీ కన్ను పడింది. ఆ సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే, మానస మాత్రం తన లుక్స్, పెర్ఫార్మెన్స్ తో బాగానే ఆకర్షించింది. ప్రస్తుతం ఆమెపై ఎంక్వయిరీలు జోరుగా సాగుతున్నాయి. 

ఇక మరో ముద్దుగుమ్మ కాయదు లోహర్ (Kayadu Lohar). ఓ ఫ్లాప్ సినిమా చేసి ఇండస్ట్రీని ఆకర్షించిందంటే ఈమె టాలెంట్ ను అర్థం చేసుకోవచ్చు. ఫంకీ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం నాని సరసన ‘ది ప్యారడైజ్’ సినిమాలో నటిస్తోంది. అటు తమిళ సినిమాలతో కూడా బిజీగా ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. 

మరో హీరోయిన్ పేరు ప్రీతి ముకుందన్ (Preity Mukundhan). ఈమెది కూడా ఫ్లాప్ ఎంట్రీనే. అయినప్పటికీ అవకాశాల వేటలో మెల్లమెల్లగా ముందు వరుసలోకి వస్తోంది. ప్రస్తుతం సితార బ్యానర్ పై ఓ సినిమా చేస్తోంది. త్వరలోనే బాబి దర్శకత్వంలో చిరంజీవి సినిమాలో నటించబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సాయిదుర్గతేజ్ సినిమాలోకి కూడా ఎంటర్ అవుతుంది. 

శివానీ నగరం (Shivani Nagaram) కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. లిటిల్ హార్ట్స్ సక్సెస్ తో ఊపుమీదున్న ఈ బ్యూటీ, హే భగవాన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది. మరో 2 తెలుగు సినిమాలు, 2 తమిళ సినిమాలు లైన్లో పెట్టింది. ఇలా తెలుగుతెరపై కొత్త అందాలు చాలానే దూసుకొస్తున్నాయి.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!

Recent News

  • Anantha Sriram: లిరిసిస్ట్ కి వసూళ్ల దురద ఎందుకు?
  • ఒకే వారంలో 2 బ్లాక్ బస్టర్లు: Blast and Avatar 3
  • Samantha తల్లి కాబోతోందని కన్ఫర్మ్ చేసిన చిరంజీవి
  • Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Irumudi: రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes