Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Feb 2026 BO: 20 సినిమాల్లో ఒక్కటి మాత్రమే

TeluguCinema, March 1, 2026March 1, 2026
Couple Friendly

Telugu Films and Feb 2026 BO reort: ఫిబ్రవరిలో అటుఇటుగా 23 సినిమాలు (రీ-రిలీజెస్ తో కలిపి) విడుదలయ్యాయి. సంక్రాంతి తర్వాత మెరుస్తుందని భావించిన బాక్సాఫీస్ ఫిబ్రవరిలో కూడా వెలవెలబోయింది. ఉన్నంతలో ఒకే ఒక్క సినిమా ఓకే అనిపించుకుంది. ఆ 20 సినిమాలేంటి.. ఫర్వాలేదనిపించుకున్న ఆ ఒక్క సినిమా ఏంటి? ఫిబ్రవరి బాక్సాఫీస్ రివ్యూ

ఫిబ్రవరి మొదటివారంలో.. ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కాస్త చెప్పుకోదగ్గ రేంజ్ సినిమా, ప్రచారం గట్టిగా చేసిన సినిమా ‘యుఫోరియా’. ‘శాకుంతలం’ తర్వాత గుణశేఖర్ డైరక్ట్ చేసిన సినిమా ఇది. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఈ దర్శకుడికి కలిసిరాలేదు. యూత్ ను టార్గెట్ చేస్తూ, తల్లిదండ్రులకు సందేశమిస్తూ తీసిన ఈ సినిమా జనానికి నచ్చలేదు.

ఇదే టైమ్ లో ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాపై కూడా కాస్త చర్చ నడిచింది. దానికి కారణం ఈ సినిమా హీరో, నిండు సభలో బూతు పాట పాడటమే. ఆ తర్వాత అది కాస్తా వివాదాస్పదమవ్వడంతో ఈ సినిమాపై కొంతమంది దృష్టి పడింది. అయితే సినిమా డిజాస్టర్ అయింది. ఈ రెండు సినిమాలతో పాటు ‘విత్ లవ్’, ‘లగ్గం’, ‘బ్లడ్ రోజెస్’ లాంటి సినిమాలొచ్చాయి కానీ ఆ విషయం జనాలకు తెలియదు.

రెండో వారంలో.. ‘నిలవే’, ‘ఫంకీ’, ‘అమరావతికి ఆహ్వానం’, ‘స్కై’, ‘సీతాపయనం’, ‘కపుల్ ఫ్రెండ్లీ’ లాంటి సినిమాలొచ్చాయి. విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ సినిమా ఫ్లాప్ అయింది. అర్జున్ తన కూతుర్ని పెట్టి తీసిన ‘సీతాపయనం’ కూడా ఫ్లాప్. సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మాత్రం మెప్పించింది. బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా కాకపోయినా, సంతోశ్ ను నిలబెట్టే మూవీగా గుర్తింపు తెచ్చుకుంది.

మూడో వారంలో ‘హే బలవంత్’, ‘నవాబ్ కేఫ్’ సినిమాలు రాగా.. ఈ రెండూ ఫ్లాపులయ్యాయి. సుహాస్ నటించిన ‘హే బలవంత్’ సినిమా కూసింత నవ్వులు పంచినా ఆడియన్స్ కు అవి సపోలేదు. ఇక ‘నవాబ్ కేఫ్’ సినిమా అక్కడక్కడ ఆకట్టుకుంది తప్ప, ఓవరాల్ గా ఫ్లాప్ అయింది.

నెలకు ముగింపునిస్తూ ‘విష్ణువిన్యాసం’ వచ్చింది. శ్రీవిష్ణు నటించిన ఈ సినిమాకు మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. నిలదొక్కుకోవడం కష్టమనే టాక్ వినిపిస్తోంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి

Recent News

  • Kangana Ranaut: పెద్దిపై ‘క్వీన్’ కామెంట్స్!
  • దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • నన్ను పొగడండి ప్లీజ్: Jagapathi Babu
  • నర్సుల యూనిఫామ్‌లు మార్చాలి: Kangana Ranaut
  • Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes