
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani)ట్రైలర్ విడుదల...
‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు.
బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా ఇది.
తాజాగా విడుదలైన ట్రైలర్ ఓ పక్క నవ్వులు పూయిస్తూనే, మరోపక్క ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీగా శివాజీ, ఆయన భార్య ఉత్తరగా డిఫరెంట్ పాత్రలో లయ నటించారు.
ఎంతో అమాయకంగా, సాంప్రదాయబద్ధంగా జీవించే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అనుకోకుండా కొన్ని విచిత్రమైన, ఊహించని నేరాల్లో ఎలా ఇరుక్కుంది.? దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి.? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఈ కథను నడిపించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాను మార్చి 6, 2026న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
