
జాన్వీ కపూర్, అనన్య పాండే ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళు. ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇద్దరికీ బాలీవుడ్ లో సరైన హిట్ పడడం లేదు. అనన్య పాండే గతేడాది రెండు సినిమాలు విడుదల చేసింది. అందులో ఒకటి క్రిస్మస్ కానుకగా విడుదలైంది. అదే “తు మేరి మై తేరా మై తేరా తు మేరి (Tu Meri Main Tera Main Tera Tu Meri).
బాలీవుడ్ యువ హీరోల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు ఇందులో. కార్తీక్ సరసన నటించింది కాబట్టి తనకి హిట్ గ్యారెంటీ అనుకుంది ఈ అమ్మడు. కానీ మొదటి వారం కలెక్షన్లు చూస్తే హీరో కార్తీక్ కి కూడా పరువు పోయింది. మొదటి వారం ఈ సినిమా ఇండియాలో 28 కోట్లు కలెక్ట్ చేసింది.
హీరో కార్తీక్ ఆర్యన్ సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్నాడు. కానీ సినిమాకి 30 కోట్లు కూడా థియేటర్ నుంచి రాలేదు. అంత ఘోర పరాజయం అయింది. అనన్య పాండే ఆశలు మరోసారి వమ్ము అయ్యాయి. మరో ఫ్లాప్ ఆమె ఖాతాలో పడింది.
