
ఆ మధ్య బెంగుళూర్ లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుందన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు నటి హేమ (Hema). ఆ తర్వాత ఆమెకి బెయిల్ వచ్చింది. ఆ కేసులో ఆమె తప్పు లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఐతే, మీడియా చేసిన హంగామా, సోషల్ మీడియాలో ఆమె జరిగిన రచ్చ ఆమెని చాలా కాలం బాధ పట్టింది.
తాజాగా మళ్ళీ ఆమె మీడియాని కలిసింది. “మీ హేమ అక్క ఎప్పుడూ తప్పు చెయ్యదు,” అంటూ ప్రామిస్ చేసింది.
డ్రగ్స్ కేసు వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు హేమ. “ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది. మానసికంగా అంత కుంగిపోయాను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్ళీ సినిమాల్లో నటిస్తాను అని వివరించారు. ఆ కేసు తర్వాత తనకి ఒక్క పాత్ర కూడా దక్కలేదు.
