
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీకి అందరూ రావాలని, ఇక్కడ ఎటువంటి వివక్ష, ఇబ్బందులు లేవని చెప్పారు. ఆయన ఒక ఇండస్ట్రీ పెద్దగా ఈ మాట చెప్పడం మంచిదే. కానీ క్యాస్టింగ్ కౌచ్ లేదు అనడానికి తన కూతురు సుస్మిత విజయం, అశ్విని దత్ కూతుళ్లు ప్రియాంక, స్వప్నల విజయాలు, సుప్రియ యార్లగడ్డలను ఉదాహరణగా చూపడమే విచిత్రం.
క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొనేది హీరోయిన్లు అవుదామనుకునే అమ్మాయిలు. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత హీరోయిన్ గా ప్రయత్నాలు చెయ్యలేదు, నటించలేదు. అశ్విని దత్ కూతుళ్లు కూడా నిర్మాతలే, హీరోయిన్లు కాదు. సుప్రియ ఒక సినిమాలో నటించి ఆ తర్వాత నిర్మాతగా సెటిల్ అయ్యారు. వీళ్ళను ఉదాహరణగా చూపి క్యాస్టింగ్ కౌచ్ లేదనడం తప్పే కదా.
అయినా చిరంజీవి, అక్కినేని, దత్ వంటి పెద్ద కుటుంబాల పిల్లలకు అలాంటి సమస్యలు ఎందుకు ఎదురవుతాయి?
సమస్య ఎటువంటి అండ, ఇండస్ట్రీలో లింక్ లు లేని కొత్త నటీనటుల రావాలనుకున్నప్పుడు “అది ఇస్తే ఇది ఇస్తా” అనే బ్యాచ్ తోనే కదా. ఆ విషయం పక్కన పెట్టి మెగాస్టార్ తన కూతురు సక్సెస్ ని చూపి ఇక్కడ అమ్మాయిలు “సేఫ్” అంటే ఎలా?
