
Rishab Shetty’s Demands: రిషబ్ శెట్టి “కాంతార” సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చాడు. “కాంతార”తో పాటు దానికి సీక్వెల్ గా వచ్చిన మూవీ కూడా ఘన విజయం సాధించింది. దాంతో, రిషబ్ శెట్టి మార్కెట్ మొత్తంగా భారీగా పెరిగింది. దాంతో, రెండు కొత్త సినిమాలు తెలుగులో, ఒకటి హిందీలో ఒప్పుకున్నాడు.
విచిత్రం ఏమిటంటే కన్నడ సినిమాలతో భారీ విజయాలు అందుకున్న ఈ కన్నడ హీరో ఇప్పుడు అక్కడ సినిమాలు చెయ్యడం లేదు. ఎందుకంటే అతను ఇప్పుడు అడుగుతున్న పారితోషికం అలా ఉంది. సినిమాకి 80 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నాడట. దాంతో కన్నడ చిత్ర నిర్మాతలు అంత ఇవ్వలేక వదిలేశారు.
అదే మన తెలుగు నిర్మాతలకు 80 కోట్లు పెద్ద లెక్క కాదు. 300 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలకే అంత మొత్తం ఇస్తున్నప్పుడు కొడితే 800 కోట్లు రాబట్టే రిషబ్ శెట్టికి 80 కోట్లు ఇవ్వడం పెద్ద విషయం కాదని మన తెలుగు నిర్మాతలు లెక్కలు వేసుకొని రెండు సినిమాలు సైన్ చేశారు.
ఐతే, “కాంతార” సినిమాలు తప్ప మరో సినిమాతో భారీ హిట్స్ ఇవ్వలేదు రిషబ్. మరి తెలుగులో చేస్తున్న సినిమాలతో కూడా నిజంగా 500 కోట్ల సినిమాలు ఇవ్వగలడా? అంత పారితోషికం ఇవ్వడం కరెక్టేనా? కాలమే సమాధానం చెప్తుంది.
