
శృతి హాసన్ (Shruti Haasan) తాజాగా తన కొత్త ఫోటోషూట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూస్తే ఆమె జూనియర్ ఎన్టీఆర్ కన్నా సన్నబడింది. ఇటీవల ఎన్టీఆర్ తన కొత్త సినిమా పాత్ర కోసం సన్నబడ్డారు. ఆ లుక్ చూసి అతన్ని జనం ట్రోల్ చేశారు.
ఇప్పుడు శృతి హాసన్ కూడా అలాగే కామెంట్లు ఎదురుకొంటోంది. ఆమె ఎప్పుడూ బొద్దుగా లేదు. కానీ వయసుకి తగ్గట్లు కొంచెం బరువు పెరిగింది. ఐతే, ఇప్పుడు 40 దాటిన తర్వాత మరింత స్లిమ్ కావాలనే ఉద్దేశంతో ఆమె ఇలా మారింది. ఇది సినిమా కోసం కాదు, ఒక పాత్ర కోసం అంతకన్నా కాదు. ఫిట్నెస్ కోసం అంటూ మరీ ఓవర్ గా తగ్గింది.
దాంతో ఆమెపై కామెంట్లు పడుతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీల మాదిరిగా నువ్వు కూడా Ozempic (semaglutide) ఇంజెక్షన్ తీసుకున్నావా అంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు. డయాబెటిస్ పేషంట్లు బరువు తగ్గేందుకు కనిపెట్టిన ఈ ఇంజెక్షన్ ని ఇటీవల సినిమా సెలెబ్రిటీలు తమ ఫిట్నెస్ కోసం దీన్ని విరివిగా వాడుతున్నారు అని అంటున్నారు. శృతి హాసన్ ఎప్పుడూ లావు కాలేదు. ఇంజెక్షన్ ఇప్పించుకొని బరువు తగ్గాల్సిన స్థితిలో ఆమె లావు కాలేదు.
ఇక్కడ చూడండి: శృతి హాసన్ తాజా ఫోటో షూట్ ఫోటోలు మరిన్ని
కానీ మరీ ఇంత స్లిమ్ కావడంతోనే ఆమెపై ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి.
