
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జైలర్ 2’ (Jailer 2). ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మొదటి భాగమైన ‘జైలర్’ సాధించిన సంచలన విజయంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్ కు ఉన్న క్రేజ్, మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని ఇక్కడ కూడా భారీ రేట్లకు అమ్మాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు ఏకంగా 60 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ఈ స్థాయిలో రేటు చెప్పడంతో తెలుగు ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులు, అలాగే రజినీకాంత్ గత చిత్రం ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడం వంటి కారణాలతో ఇంత భారీ ధర చెల్లించడం సాహసమనే అభిప్రాయం వినిపిస్తోంది.
కూలీ సినిమా తెలుగు రైట్స్ 52 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ‘జైలర్-2’కు క్రేజ్ ఉంది కాబట్టి 60 కోట్లు అడుగుతున్నారు. మేకర్స్ లాజిక్ ఇది. మరి ఈ లాజిక్ కు ఎంతమంది తెలుగు డిస్ట్రిబ్యూటర్లు పడతారో చూడాలి.
