Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

రష్మిక ట్రిప్పుల తిప్పలు

Admin, July 29, 2024
Rashmika Mandanna

రష్మిక మందాన నిజమైన పాన్ ఇండియన్ హీరోయిన్. ఆమెకి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో, బాలీవుడ్ లో అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఆమెకి బాలీవుడ్ లోనే ఎక్కువ డిమాండ్, క్రేజ్ ఉంది. అందుకే, ఈ భామ ఇటు తెలుగు సినిమాలు, అటు హిందీ సినిమాలు సమానంగా చేస్తోంది.

ఆమె సంపాదన బాగుంది. కానీ ఇలా తెలుగు, హిందీ సినిమాల కారణంగా నెలకు 10, 15 సార్లు ముంబై – హైదరాబాద్ మధ్య చక్కర్లు కొట్టాల్సి వస్తోందట. ఆమె విమాన ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అలాగే, అటు ఇటు చక్కర్ల కారణంగా ఎక్కువగా అలిసిపోతోందట.

ఆ విషయాన్ని ఆమె ఇటీవల బయటపెట్టింది. ఐతే, తనకు పనిలోనే ఎక్కువ సంతృప్తి దక్కుతుంది అని కూడా పేర్కొంటోంది. ట్రిప్పుల తిప్పలు మినహా మిగతా అంతా సూపర్ గానే ఉందని చెప్తోంది.

ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రాలు ఇవే.

  1. కుబేర
    ఇందులో ధనుష్ సరసన నటిస్తోంది. ఈ సినిమా కథ కూడా కొంత భాగం ముంబై నేపథ్యంగా సాగుతుంది. శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
  2. పుష్ప 2
    ఇందులో ఆమె శ్రీవల్లిగా నటిస్తోంది. అల్లు అర్జున్ భార్య పాత్ర ఆమెది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకొంది.
  3. ది గర్ల్ ఫ్రెండ్
    ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం. షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది.
Rashmika Mandanna

హిందీ చిత్రాలు ఇవే

  1. సికిందర్
    సల్మాన్ ఖాన్ సరసన ఆమె నటిస్తున్న భారీ మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మురుగదాస్ తీస్తున్న ఈ భారీ సినిమా కోసమే ప్రస్తుతం ముంబైలో ఎక్కువగా ఉంటోంది.
  2. చావా
    విక్కీ కౌశల్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది.

ఈ సినిమాలు కాకుండా ఆమె అనేక యాడ్స్ లో నటిస్తుంటుంది. అలాగే, ఎన్నో ఫ్యాషన్ మేగజైన్ లకు ఫోటోషూట్ లు చేస్తూ ఉంటుంది. వీటి కోసం కూడా ఆమె తరుచుగా ముంబైకి వెళ్ళాలి. ఇప్పటికే ముంబైలో ఆమె ఒక అపార్ట్మెంట్ రెంట్ కి తీసుకొంది. ఇక హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

Recent News

  • Agadha: బోనాలతో ప్రచార జాతరకు శ్రీకారం
  • OM: ధనుష్ అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు
  • Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ
  • Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes