
అల్లు అర్జున్ కూడా స్పీడ్ పెంచుతున్నాడు. ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి చేసి, మరో సినిమా షూటింగ్ కి సిద్ధం అవుతున్నాడు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ ఏడాదిలోనే ఇంకో సినిమాకి కొబ్బరికాయ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.
అంటే ఒకేసారి మూడు సినిమాలు సెట్ చేస్తున్నాడు అల్లు అర్జున్.
లోకేష్ కనగరాజ్ సినిమా ఈ ఏడాదే మొదలవుతుంది. దాని షూటింగ్ చాలా స్పీడ్ గా పూర్తి అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే 5 నెలల్లోనే మొత్తం సినిమా పూర్తి అవుతుంది. అంటే ఈ ఏడాది జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తే డిసెంబర్ లోపే అది కంప్లీట్ అవుతుంది.
ఆ తర్వాత చేసే సినిమా విషయంలో కూడా అల్లు అర్జున్ క్లారిటీగా ఉన్నాడు. ఐతే, ఆ దర్శకుడి నుంచి క్లారిటీ రావాలి. అది వస్తే ఈ మూడో సినిమా కూడా ప్రకటిస్తాడు.
