
మహేష్ బాబు ప్రస్తుతం “వారణాసి” సినిమా షూటింగ్ లో ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో “వారణాసి” విడుదల కానుంది. రాజమౌళి గతంలోలా కాకుండా ఈ సారి పక్కా ప్లానింగ్ తో సినిమా షూటింగ్ తీస్తున్నారు. సినిమా 2027 ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్నా దానికి ఆరు నెలల ముందే షూటింగ్ పూర్తి కానుంది.
అంటే అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ క్లోజ్ అవుతుంది. మరి ఆ తర్వాత మహేష్ బాబు చేసే సినిమా ఏంటి?
ఈ విషయంలో మహేష్ బాబు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కానీ, ఒక ఇద్దరు దర్శకులతో ఇప్పటికే మహేష్ చర్చలు మొదలుపెట్టారు. ఈ ఇద్దరిలో ఎవరు కథతో ఒప్పిస్తే వారికే ఫస్ట్ ఛాన్స్ ఉంటుంది.
“వారణాసి” సినిమాతో తనకి గ్లోబల్ స్థాయిలో క్రేజ్ వస్తుంది అని మహేష్ బాబు నమ్మకంగా ఉన్నారు. ఐతే, మార్కెట్ కన్నా ముఖ్యంగా దర్శకుడి విషయంలోనే క్లారిటీ తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ చేసిన తప్పులు చెయ్యకుండా రాజమౌళి సినిమా తర్వాత కూడా భారీ హిట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట.
