Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Aura of Ustaad: మెడ, తొడ: ఫ్యాన్స్ కి నచ్చలేదు!

TeluguCinema Team, February 23, 2026February 23, 2026
Aura of Ustaad

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో “ఉస్తాద్ భగత్ సింగ్” వస్తోంది. “గబ్బర్ సింగ్” తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం ఇది. మొదటి పాట కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ 31/జనవరి 1న విడుదలైంది. నిన్న రెండో పాట విడుదలైంది.

రెండవ గీతంగా వచ్చిన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ (Aura of Ustaad)అనే ఈ పాటలో “నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే, జుట్టు ఎగురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే” లైన్లు ఉన్నాయి. కానీ ఈ లైన్లు అభిమానులకు పెద్దగా నచ్చినట్లు లేదు. చంద్రబోస్ రాసిన ఈ లిరిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయి అని అభిమానులే ట్విట్టర్ లో కామెంట్ చేస్తున్నారు.

దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట అభిమానులకు ఊపు ఇచ్చేలా ప్లాన్ చేశారు. కానీ ఫ్యాన్స్ దగ్గరి నుంచే ప్రస్తుతం మిశ్రమ స్పందన వస్తోంది. బహుశా సినిమాలో ఈ పాట వచ్చే సందర్భం, సినిమాలో బాగా అద్బుతంగా క్లిక్ అయితే ఈ అభిప్రాయం మారొచ్చు. ప్రస్తుతానికి “మెడ, తొడ” నచ్చలేదు.

ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ సినిమాకి ఇంకా రావాల్సిన హైప్ రావడం లేదు ఈ పాట కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం మరింత నిరాశపరిచింది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

Recent News

  • Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!
  • విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi
  • Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Pooja Hegde: ఆమెకి కత్తెర వేశాను, దర్శకుడి వ్యాఖ్యలు వైరల్
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes