
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా నాలుగేళ్ల క్రితం ప్రకటించారు. ఐతే, ఆ సినిమా వాయిదా పడుతూ పడుతూ పేరు మార్చుకొంది, కథ మార్చుకొంది. ఫైనల్ గా “ఉస్తాద్ భగత్ సింగ్” అనే పేరుతో రూపొంది ఈ నెల 26న విడుదల కానుంది.
“మొదట కాలేజ్ నేపథ్యంగా ఒక కథ రాశాను. అప్పుడు భవదీయుడు భగత్ సింగ్ అనే పేరు అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం ఉన్న ఇమేజ్, అభిమానులు ఆయన నుంచి కోరుకునే సినిమాలను దృష్టిలో పెట్టుకొని కాలెజ్జ్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ వద్దని భావించాం. ఆ తర్వాత కథ మార్చి పవన్ కళ్యాణ్ ని పోలీస్ గా చూపిస్తున్నాం. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ అయింది,” అని హరీష్ శంకర్ తాజాగా వివరణ ఇచ్చారు.
ఇది “తెరి” అనే సినిమాకి రీమేక్ గా రూపొందుతోంది. ఐతే, రీమేక్ అనడం కన్నా ఆ స్ఫూర్తి అనడం కరెక్ట్. చాలా వరకు కథని మార్చేశారు. సీన్లు కూడా కొత్తగా రాసుకున్నారట. కాకపోతే, విలన్, హీరో మధ్య సీన్లు “తెరి” సినిమాలాగే ఉంటుంది. భార్య చనిపోవడం వంటి కథ లేదు.
“ఇది తీరి మూవీ కాదు. రీమేక్ అయితే అవును ఇది రీమేక్ అని చెప్పడానికి నేను సంకోచించను,” అని హరీష్ శంకర్ అంటున్నారు.
