Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Sree Vishnu: విష్ణు ఇకపై అలా చెయ్యకు!

TeluguCinema, February 26, 2026February 26, 2026
Sree Vishnu

విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ అనే రెండు సినిమాల్లో నటించాడు శ్రీ విష్ణు (Sree Vishnu). రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ లో విడుదల అయ్యేందుకు ప్రయత్నించాయి. ఆ ప్రమాదం తృటిలో తప్పింది. ఇప్పుడు ఒక వారం గ్యాప్ లో విడుదల కానున్నాయి. ఐతే, ఇకపై ఇలా చెయ్యొద్దు అని తెలుగు నిర్మాతలు శ్రీ విష్ణుకి సలహా ఇచ్చారు.

“సింగిల్” సినిమాతో మంచి విజయం అందుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు శ్రీ విష్ణు. కామెడీతో సక్సెస్ అయి కింగ్ అఫ్ ఎంటర్టైన్మెంట్ అనే పేరు తెచ్చుకున్నాడు. అతనికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. నిర్మాతలు అందరూ పోటీ పడుతున్నారు సినిమాలు చేసేందుకు. ఐతే, “సింగిల్” సినిమా విడుదలకు ముందే “మృత్యంజయ్”, “విష్ణు విన్యాసం” సినిమాలు ఒప్పుకున్నాడు. ఈ రెండు సినిమాలకు ఓటిటి డీల్స్ పూర్తి అయ్యాయి.

శ్రీ విష్ణుకి ఉన్న ఇమేజ్ వల్ల ఓటిటి కంపెనీలు కొనేశాయి. వాటిని మార్చి మొదటివారంలోపే విడుదల చెయ్యాలని ఓటిటి కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాంతో, రెండు సినిమాలు ఒకే టైములో విడుదల చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే, శ్రీ విష్ణు ఇద్దరి నిర్మాతలను ఒప్పించి రెండు సినిమాల విడుదల మధ్యలో కనీసం ఒక వారం గ్యాప్ ఉండేలా చేశాడు.

ఐతే, ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఇతర నిర్మాతలు విష్ణుకి చెప్పారు. అతను కూడా ఇక సినిమాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను అని తెలిపాడు. హిట్స్ వచ్చినా ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అని శ్రీవిష్ణుకి అర్థమైంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట

Recent News

  • Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే
  • OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ
  • Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes