
రాశి ఖన్నా కూడా ఐటెం సాంగ్ లలోకి దిగుతోంది అని ఇటీవలే తెలుగుసినిమా.కామ్ ప్రచురించింది. ఐతే, తాజా సమాచారం ప్రకారం చివరి నిమిషంలో డ్రాప్ అయింది. షూటింగ్ కి వెళ్లే టైంలో తాను ఆ పాట చెయ్యను అని మేకర్స్ కి తెలిపింది. దాంతో, షూటింగ్ ని ఒక రెండు రోజులు నిలిపి వేసింది టీం.
ఇదంతా “అనగనగా ఒక రోజు” సినిమా గురించి. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. ఈ నెల 14న విడుదల కానుంది ఈ మూవీ. సినిమాకి కొంచెం గ్లామర్ అట్రాక్షన్, అలాగే కొంత పబ్లిసిటీ హైప్ కావాలనే ఉద్దేశంతో టీం రీసెంట్ గా ఒక ఐటెం సాంగ్ చిత్రకరించి జతపరుద్దామని అనుకున్నది. దాంతో, టీం రాశి ఖన్నాని సంప్రదిస్తే వెంటనే ఓకె చెప్పింది.
తీరా షూటింగ్ కి ఒక రోజు ముందు తాను చెయ్యలేను అని సమాచారం ఇచ్చిందట. దానికి కారణం ఇప్పుడు ఐటెం సాంగ్ లు చేస్తే ఇక అన్నీ అవే ఆఫర్లు వస్తాయని చెప్పారట ఆమె శ్రేయోభిలాషులు. అలాగే ఇటీవల నేహా శెట్టి “ఓజి” సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే అది తుస్సుమంది. ఈ నేపథ్యంలో రాశి ఖన్నా తాను చెయ్యను అని డ్రాప్ అయిందట.
దాంతో, రాశి స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ భామ నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్” విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ సరసన మెయిన్ హీరోయిన్ గా నటించింది రాశి ఖన్నా. ఈ సినిమాపై ఈ అమ్మడు ఎక్కువ ఆశలు పెట్టుకుంటోంది.
