
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao)కి ఇప్పుడు 94 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఆయన సినిమాలు తీస్తున్నారు. తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పుడు దర్శకుడిగా ఇండియాలో మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీ మూవీ తీస్తున్నారు. ఈ సినిమాకి ‘సింగ్ గీతం’ (Sing Geetham) అనే పేరు ఖరారు చేశారు.
సంగీతం, మ్యాజికల్ రియలిజంను మేళవించి ఓ యూనిక్ అనుభూతిని అందిస్తుంది ఇది అని చెప్తున్నారు మేకర్స్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్ల పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తుండడం విశేషం.
ఒక రహస్యమైన గ్రామం నేపథ్యంలో సాగే ‘సింగ్ గీతం’, ప్రతాప్ అనే యువకుడి కథ చుట్టూ తిరుగుతుంది.ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. తాజాగా టీజర్ విడుదలైంది.
‘సింగ్ గీతం’ (Sing Geetham) చిత్రాన్ని జూన్ 11న థియేటర్లలో విడుదల చేస్తారు.
