
గెటప్ శ్రీను (Getup Srinu) తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ, కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది.
శ్రీను మాట్లాడుతూ “మేము కాపులం” అంటూ ఏదో సందర్భంలో స్పందించగా, ఆ వ్యాఖ్యపై జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. “అలా మాట్లాడకూడదు” అంటూ జాఫర్ స్పందించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం.
వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో గెటప్ శ్రీను తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, “ఈ తొక్కలో ఇంటర్వ్యూ నేను చేయను” అంటూ ఇంటర్వ్యూను మధ్యలోనే నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియో బయటకు వస్తే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
