
“ది రాజాసాబ్’కి మరో రెండు రోజుల్లో అమెరికాలో ప్రీమియర్ షోలు పడుతాయి. అమెరికా ప్రీమియర్ షోలకు అడ్వాన్ బుకింగ్ లు (ప్రీ సేల్స్) గట్టిగానే ఉన్నాయి. కానీ భారీ ఊపు లేదు. థియేటర్లు తక్కువ దొరకడం ఒక సమస్య. అవతార్ 3 అమెరికాలో ఇంకా బాగా ఆడుతోంది. ఇతర హాలీవుడ్ సినిమాలకు థియేటర్లు ఫుల్లుగా కేటాయించారు. దాంతో, సంక్రాంతి తెలుగు సినిమాలకు అమెరికాలో థియేటర్ల కొరత ఉంది.
దాంతో, “ది రాజా సాబ్”కి రావాల్సినంత పెద్ద మొత్తంలో ప్రీ-సేల్స్ లేవు. సాధారణంగా ప్రభాస్ సినిమాలు అమెరికాలో 2 మిలియన్లకి పైగా ప్రీమియర్ షో వసూళ్లు అందుకుంటాయి. రాధేశ్యామ్ లాంటి సినిమాలే మాత్రమే మిలియన్ మార్క్ అందుకోలేకపోయాయి.
ఇప్పుడు “ది రాజాసాబ్” మిలియన్ మార్క్ ని సులువుగానే లాగేస్తుంది అని అంచనా. కానీ ప్రీ-సేల్స్ తోనే మిలియన్ మార్క్ ని అందుకోవడం కష్టం. ప్రభ్స్ నటించిన “కల్కి” సినిమా విడుదలకు చాలా రోజుల ముందే వన్ మిలియన్ మార్క్ ని దాటేసింది. కానీ “ది రాజా సాబ్”కి అంత ఊపులేదు.
దర్శకుడు మారుతికి నాగ్ అశ్విన్ రేంజ్ లో పేరు లేకపోవడం ఒక కారణం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మారుతికి పెద్ద దర్శకుల జాబితాలో చోటు దక్కుతుంది. ఇప్పుడైతే అంత క్రేజ్ లేదు అతనికి. ఇవన్నీ కారణాల వల్ల “ది రాజాసాబ్” ప్రీమియర్ షో కలెక్షన్ మిలియన్ కి అటుఇటుగా మాత్రమే వచ్చేలా కనిపిస్తోంది.
