
ఇటీవల హీరో విజయ్ (Vijay), హీరోయిన్ త్రిష (Trisha) గురించి తెగ చర్చ జరుగుతోంది. ఇప్పటికే విజయ్ భార్య ఆయన నుంచి విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేశారు. వచ్చే నెలలో ఆ కేసు విచారణకు రానుంది. ఇక వచ్చేనెల 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
విజయ్ మొదటి సారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆయన పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తోంది. ఎన్నికలు ఏప్రిల్ 23న జరిగినా ఫలితాలు మాత్రం మే 4న ప్రకటిస్తారు. మే 4కి ఉన్న మరో ప్రత్యేకత త్రిష పుట్టిన రోజు.
దాంతో, త్రిష పుట్టిన రోజు నాడు విజయ్ పొలిటికల్ భవితవ్యం తేలిపోతుంది అని కామెంట్లు చేస్తున్నారు.
