Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Mana Shankara Vara Prasad Garu Review (తెలుగు)

TeluguCinema, January 12, 2026January 12, 2026

Mana Shankara Vara Prasad Garu is a Sankranthi 2026 Telugu film starring Megastar Chiranjeevi. Below is our Telugu review of the film.

Chiranjeevi and Venkatesh in Mana Shankara Vara Prasad Garu

“మన శంకర వరప్రసాద్‌గారు” సినిమాతో సంక్రాంతి సీజన్‌లో చిరంజీవి మరోసారి కుటుంబ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హంగులు, భారీ యాక్షన్ కాకుండా, సరదా మాటలు, చిన్న భావోద్వేగాలతో నడిచే కథను ఎంచుకున్నారు చిరంజీవి. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి? ఎలా ఉంది?

“మన శంకర వరప్రసాద్‌ గారు” కథ ఏంటి?

శంకర వర ప్రసాద్ (చిరంజీవి) ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఢిల్లీలో ఒక మినిష్టర్ కి చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తుంటాడు. ఆయన భార్య శశిరేఖ (నయనతార) గొడవపడి విడిపోయింది. ఇద్దరు పిల్లలను తండ్రికి కలవకుండా పెంచుతోంది. వాళ్ళు ఒక హిల్ స్టేషన్ లో ఒక రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుతుంటారు. శశిరేఖ ఆమె తండ్రి జీవిఆర్ (సచిన్ ఖేడేకర్) వ్యాపారాన్ని చూస్తూ ఉంటుంది.

వాళ్ళ అమ్మ చెప్పిన మాటల కారణంగా పిల్లలు తనని ఇష్టపడడం లేదు, తనని కలవడం లేదని గ్రహించిన శంకర వర ప్రసాద్ వారిని దగ్గరకు చేసుకునేందుకు వారి స్కూల్ లోనే పీటీ టీచర్ గా చేరుతారు. తక్కువ టైంలోనే వారు తనని లైక్ చేసేలా చేసేస్తాడు. ఐతే, శశిరేఖకి మళ్ళీ వాళ్ళ ద్వారా దగ్గరవ్వాలనుకుంటాడు. ఈ లోపు జీవీఆర్ పై కొందరు దుండగులు దాడి చేస్తారు. దాంతో, మంత్రి వాళ్లకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. ఆ అధికారి ఎవరో కాదు…. శంకర వర ప్రసాద్.

తన భార్య, తన మావయ్యపై దాడి చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకు చేశారు? అనే కోణంలో పరిశోధన చెయ్యడమే కాదు ఆమెకి మళ్ళీ దగ్గర అవ్వడం ఆయన లక్ష్యం. ఇది కథ.

విశ్లేషణ: సినిమా ఎలా ఉంది?

అనిల్ రావిపూడి సినిమాలంటే ప్రేక్షకులు ఆశించేది హాస్యం. ఈ సినిమాలో కూడా అదే దారి కనిపిస్తుంది. చిరంజీవి ఒక పాతికేళ్ల క్రితం “డాడీ” అనే సినిమా చేశారు. ఇటీవల అజిత్, నయనతార జంటగా “విశ్వాసం” అనే సినిమా చేసి విజయం అందుకున్నారు. ఈ రెండు సినిమాలను మిక్స్ చేసి తీశారు అనిల్ రావిపూడి. కథలో కొత్తదనం లేదు. సీన్లు కూడా ఒకదానికి ఒకటి అలా అల్లుకుంటూ సాగదీశారు. అయినా చిరంజీవి టైమింగ్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన హాస్యం బాగా వర్కవుట్ అయ్యాయి. తన కథ, తన కథనం కన్నా చిరంజీవి నటన, ఆయన కామెడీ చేష్టలు, డైలాగులపై అనిల్ రావిపూడి ఎక్కువ ఆధారపడ్డారు.

చిరంజీవిని ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా చూపించడంలో దర్శకుడు ఆసక్తి చూపించాడు. కొన్ని సన్నివేశాలు మనం ఇంతకు ముందు చూసినట్లే అనిపించినా, చిరంజీవి నటన వాటిని పూర్తిగా మోయగలుగుతుంది. ఇది సంక్రాంతి సినిమా… పండుగ టైములో మీరు థియేటర్ కి వచ్చినందుకు వచ్చి నవ్వుకొని వెళ్ళండి…అంతే కానీ కథ, కాకరకాయలు అడగొద్దు అన్నట్లుగా సాగింది రావిపూడి కథనం.

మొదటి హాఫ్ అంతా పిల్లలు, పెళ్ళాం, మొగుడు చుట్టూ కథ తిరిగితే, రెండో భాగం మాజీ పెళ్లాన్ని మళ్ళీ పెళ్లి చేసుకునేందుకు చిరంజీవి ప్రయత్నించే చేష్టలు, నయనతారని పెళ్లాడేందుకు వచ్చిన వెంకీ గౌడ పాత్రలో వెంకటేష్ కామెడీ, దాడి చేసిన విలన్ ని కనిపెట్టి ఆట కట్టించడం అన్నట్లుగా సాగింది. మొదటి హాఫ్ లో “హుక్ స్టెప్”, “శశిరేఖ” పాటలు ఉండగా, రెండో హాఫ్ లో “మీసాల పిల్ల”, చిరంజీవి, వెంకీ పార్టీ సాంగ్ ఉన్నాయి. చిరంజీవి, నయనతార కలిసినప్పుడల్లా “సుందరి నీవే” అనే దళపతి చిత్రంలోని పాట రావడం బాగుంది.

ఇక వెంకటేష్ చిరంజీవి పాటలు “నవ్వింది మల్లే చెండు” “రామ్మా చిలకమ్మా” పాటలకు డ్యాన్స్ చెయ్యడం, చిరంజీవి “బ్లాక్ బస్టర్ పొంగల్” అంటూ వెంకీ పాటకు డ్యాన్స్ చెయ్యడం హైలెట్స్. ఇలా ఒక కథ, క్రమ పద్దతి లేకుండా అన్ని “కామెడీ” కోసం, “సంక్రాంతికి హిట్ కావాలె” అనే పద్దతిలో వస్తూ పోతుంటాయి. చూస్తున్నంత సేపు టైం పాస్ అవుతుంది.

ఎవరెవరు ఎలా చేశారు?

చిరంజీవి తన వయసు కన్నా చాలా యంగ్ గా కనిపించారు. నటనలో, డ్యాన్స్ లో ఇరగదీశారు. మాస్ యాక్షన్ వదిలేసి చిన్న చిన్న ఫన్ డైలాగ్ లతో లాగించారు. నయనతార తన పాత్రకు న్యాయం చేశారు. వెంకటేష్ ఎపిసోడ్ సరిగా సినిమాలో సెట్ అవ్వలేదు కానీ వెంకీ ఎంతో కొంత వినోదం పంచేలా చేశారు. క్యాథరిన్ పాత్రకు “చివర్లో న్యాయం” చేశారు.

సినిమాటోగ్రఫీ పండుగ వాతావరణాన్ని బాగా క్యాచ్ చేసింది. పాటలు కథ ప్రవాహాన్ని ఆపకుండా వచ్చి వెళ్తాయి. ఎడిటింగ్ ఇంకాస్త కుదిరితే సినిమా మరింత బాగుండేది.

ఫైనల్ గా చెప్పేది ఏంటంటే!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కాలక్షేపం కలిగిస్తుంది. కానీ “సంక్రాంతికి వస్తున్నాం” రేంజ్ కామెడీ ఉంటుంది అని ఆశ పెట్టుకోవద్దు. రైటింగ్ లోపాలు చిరంజీవి కామెడీ టైమింగ్ లో మునిగిపోయాయి. సాధారణ చిత్రమే. కాకపోతే పండుగ టైంకి టైంపాస్.

రేటింగ్: 3/5

Read the English review of Mana Shankara Vara Prasad Garu

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!

Recent News

  • అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు
  • Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ
  • తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes