వచ్చేవన్నీ 50 రోజుల తర్వాతే?

Box office


ఓటిటి వల్ల తెలుగు సినిమా థియేటర్ల వ్యాపారం బాగా దెబ్బతిన్నది. గత ఆరు నెలల్లో అరడజన్ సినిమాలు మాత్రమే జనాలని థియేటర్లలో ఆడాయి. ‘బీమ్లా నాయక్’, ‘డీజె టిల్లు’, ‘ఆర్ ఆర్ ఆర్’, ‘కేజీఎఫ్’ వంటి కొన్ని సినిమాలే గట్టి ఓపెనింగ్స్ రాబట్టాయి. అందులో కొన్ని కళ్ళు చెదిరే విజయాలు అందుకున్నాయి.

ఆఖరికి చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ వంటి పెద్ద సినిమాలు కూడా ఓపెనింగ్స్ రాబట్టలేదు. మొదట టికెట్ రేట్ల సమస్య అని భావించింది ఇండస్ట్రీ. కానీ, రెండు, మూడు వారాలకే ఏ మూవీ అయినా ఓటిటిలోకి వస్తుండడంతో జనం ఇంటి నుంచి థియేటర్ వైపు రావట్లేదు అని గ్రహించారు. దాంతో, ఇకపై 50 రోజుల రూల్ పాటించాలని భావిస్తోంది చిత్రసీమ.

జులై 1 తర్వాత విడుదలయ్యే తెలుగు సినిమాలు అన్నీ 50 రోజుల తర్వాతే ఓటిటి వేదికపై వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలుగు నిర్మాతలు భావిస్తున్నారు. ఐతే, అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో చూడాలి.

‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’, ‘వారియర్’, ‘లైగర్’, ‘గాడ్ ఫాదర్’, ఇలా వరుసగా ఎన్నో సినిమాలు విడుదల కానున్నాయి ఈ జులై 1 తర్వాత. మరి ఏ సినిమా నుంచి 50 రోజుల నిబంధన వర్తిస్తోందో!


ఇది చదవండి: విరాటపర్వం 2 వారాలకే నెట్ ఫ్లిక్స్ లోకి!

 

More

Related Stories