
ఎన్టీ రామారావు – రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ‘అడవిరాముడు’ ఒక బాక్సాఫీస్ సంచలనం. ఆ రోజుల్లో అదొక ఇండస్ట్రీ హిట్. ఆ సినిమాని సత్యనారాయణతో కలిసి ఏ సూర్యనారాయణ నిర్మించారు. 85 ఏళ్ల వయసులో సూర్యనారాయణ కన్నుమూశారు. శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు.
1971లో ఆయన శోభన్ బాబు హీరోగా ‘తాసిల్దారుగారి అమ్మాయి’ అనే సినిమాని నిర్మించారు. అది మొదటి చిత్రం. ఆ తర్వాత ప్రేమబంధం, అడవిరాముడు, కుమార రాజా, కొత్త అల్లుడు, కొత్త పేట రౌడీ, భలే తమ్ముడు (నందమూరి బాలకృష్ణ హీరో) వంటి సినిమాలు తన పార్ట్నర్ సత్యనారాయణతో కలిసి నిర్మించారు.
సత్యనారాయణ మరణించిన తర్వాత సోలోగా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా ‘మహాన్’ వంటి సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మించిన చివరి చిత్రం … ‘అత్తా నీ కొడుకు జాగ్రత్త’ (1997).
Retro: Adavi Ramudu (1977)
Advertisement