ఆదితి చిర్రుబుర్రు!


ఇంకో ప్రశ్న లేదా? అని ఆదితి చిర్రుబుర్రులాడుతోంది.

ఆదితి రావు, హీరో సిద్ధార్థ్ డేటింగ్ లో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఇక దాచడానికి కూడా ఏమి లేదు. ఆదితి రావు ఇంటికి వెళ్తూ వస్తూ అనేకసార్లు మీడియా కంటికి చిక్కాడు సిద్ధూ. తనని ఫోటోలు తీస్తున్న మీడియాపై చిరాకుపడ్డాడు సిద్దూ.

ఇప్పుడు అదితి రావు కూడా అలాగే మండిపడుతోంది. ఇటీవల ఆమెని మీడియా వాళ్ళు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అడిగారు. సిద్ధార్థ్ తో తన పెళ్లి గురించే ప్రశ్నిస్తున్నారు అని అర్థం చేసుకున్న ఈ భామ పెళ్లి అనే ప్రశ్న తప్ప మీడియా వాళ్లకు ఇంకోటి రాదా అంటూ మండిపడింది.

సిద్ధార్థ్, ఆదితి రావు మేటర్ పెళ్లి వరకు వెళ్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఇద్దరూ గతంలో అనేక ప్రేమ వ్యవహారాలు నడిపిన వారే. బాలీవుడ్ లో డేటింగ్ మేటర్స్ పెళ్లి వరకు వెళ్లే సందర్భాలు తక్కువే. బహుశా అందుకే ఆదితికి ఆ మాట ఎత్తితే కోపం వచ్చినట్లుంది.

 

More

Related Stories