పెళ్లి చేసుకుంటా కానీ…: అనుష్క శెట్టి

- Advertisement -
Anushka Shetty

మొత్తానికి అనుష్క శెట్టి తన పెళ్లి గురించి పెదవి విప్పింది. ఆమె హీరోయిన్ గా నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్ళికి సంబంధించినంతవరకు పాత విషయమే మళ్ళీ చెప్పింది.

పెళ్లి చేసుకుంటాను అంటూనే ఇప్పుడే కాదు అన్నట్లుగా మాట్లాడింది. టైం వస్తే అది ఆగదు కదా అని సమాధానం ఇచ్చింది 40 ఏళ్ల అనుష్క.

పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ అంటే ఇష్టం కానీ ఆ టైం రావడం లేదంటూ తప్పించుకుంది. కానీ పెళ్లి విషయంలో ఆమెకి ఏవో సమస్యలు ఉన్నట్లుగా అనిపిస్తోంది. అందుకే, అసలు విషయం చెప్పడం ఇష్టంలేక ఇలా సమాధానం ఇస్తోంది. దాదాపుగా 10 ఏళ్లుగా ఆమె ఇదే ఆన్సర్ ఇస్తోంది.

ఐతే, అనుష్క పూర్తిగా సినిమాలకు దూరం కావడం లేదు. ఆమె ఒక మలయాళ చిత్రం కూడా ఒప్పుకొంది. త్వరలో ఇంకో తెలుగు సినిమా కూడా స్టార్ట్ చేస్తుందట.

 

More

Related Stories