బాలయ్యకి ఎవరూ చెప్పారా?

Nandamuri Balakrishna


నందమూరి బాలకృష్ణకి వివాదాలు కొత్త కాదు. గతంలో ఆయన చేసిన ఎన్నో కామెంట్స్ ట్రోలింగ్ కి గురి అయ్యాయి. కానీ తాజాగా దివంగత శ్రీదేవిపై అసంబద్ధ వ్యాఖ్యలు మాత్రం ఆయన ఇమేజ్ ని మరింత దెబ్బతీశాయి. సంబంధం లేకుండా ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహమాన్ గురించి కామెంట్స్ చెయ్యడంతో ఆయనపై విమర్శలు మరింతగా పెరిగాయి.

నిన్నా, ఈ రోజు సోషల్ మీడియా అంతా బాలయ్యకి వ్యతిరేకంగా కామెంట్స్ తో హోరెత్తిపోయింది. ఆయనకి ఎవరూ చెప్పారా? అంటూ నెటిజన్లు ఓ రేంజులో ఆడుకుంటున్నారు. ఇక్కడ రాయలేని, చెప్పలేని మీమ్స్ తో బాలయ్యని ట్రోల్ చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ నటుడిగా మునుపటి కన్నా బిజి అవుతున్నారు. కానీ ఆయన చేసే కామెంట్స్ మాత్రం ఫిలింమేకర్స్ కి కూడా ఇబ్బందే.

 

More

Related Stories