
బండ్ల గణేష్, వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. విజయసాయి రెడ్డి కమ్మ వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చెయ్యడంతో బండ్ల గణేష్ స్పందించాడు. “నచ్చని వారిని పేరు పెట్టి తిట్టు … దయచేసి కులాన్ని తిట్టకు… ఇదేనా నీ సంస్కారం?” అంటూ మొదట గణేష్ మొదలు పెట్టారు. శుక్రవారం మొదలైన ఈ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
విజయసాయిరెడ్డి కూడా గణేష్ ని తిట్టారు. “ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా!” అంటూ ట్వీట్ చేశారు.
తగ్గేదేలే అని బండ్ల మరింత రెచ్చిపోయారు. ఎంపీ విజయసాయిరెడ్డిని దొంగగా, మోసగాడిగా ఉదహరిస్తూ ట్వీట్లు చేశారు బండ్ల. “నేను తల్లిదండ్రులకు పుట్టా.. నీలాగా నీతిలేని బ్రతుకు నేను బతకను. రాజకీయాల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒక నిజాయితీగా ఉంటా, ఒకరిని అభిమానిస్తా, ఒకరినే ప్రేమిస్తా, ఒకరితోనే ప్రాణం పోయేదాకా తోడుంటా నీ లాగా దొంగ వేషాలు వేయను దొంగ సాయి…” అంటూ బండ్ల రిప్లై సాగింది.
ఉన్నట్టుండి బండ్ల గణేష్… ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీలోని కీలక నేతతోనే సోషల్ మీడియా వేదికపై యుద్దానికి దిగడం ఆశ్చర్యపరిచింది.