నేను చూపిస్తే మీకు ఏంటి నొప్పి?

Esha Gupta


ఇషా గుప్తాకి అందాల ప్రదర్శన అంటే ఇష్టం. కానీ సంపద్రాయవాదులకు అలాంటి చేష్టలు చూడాలంటే కష్టం. ఆమె గతంలో చాలాసార్లు బోల్డుగా ఫోజులు ఇచ్చింది. అప్పుడు పెద్దగా రచ్చ కాలేదు. మొన్నటి ఫోటోషూట్ మాత్రం సంచలనం అయింది. బ్రా కూడా ధరించకుండా పైభాగం అంతా న్యూడ్ గా చూపిస్తూ ఫోజులు ఇచ్చింది. ఐతే వీపు మాత్రమే చూపిందిలెండి. కానీ ఈ ఫోజులు కలకలం రేపాయి.

ఎదో అడల్ట్ మేగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ కాదది. తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసేందుకే అలా భంగిమ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమెని ట్రోల్ చేస్తున్నారు. పోర్న్ స్టార్ అనే బిరుదు ఇచ్చి ఆమెని హేళన చేస్తున్నారు. దాంతో ఈ భామ మండిపడుతోంది.

“నేను చూపిస్తే మీకు కలిగే నొప్పి ఏంటి? ఇష్టమైన వాళ్ళు చూస్తారు. లేనివాళ్లు అన్ ఫాలో కొట్టండి. సంస్కారం, సభ్యత అంటూ నాకు పాఠాలు నేర్పకండి. నేను వీపు మాత్రమే చూపాను కదా,” అంటూ రివర్స్ లో క్లాస్ పీకుతోంది.

అందం చూడండి ఆనందించండి అన్న సూత్రం మన భారతీయులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో పో! మనవాళ్లకు ఊ అంటే మనోభావాలు దెబ్బతినేస్తాయి.

 

More

Related Stories