‘ఆర్ ఆర్ ఆర్’కి నాలుగేళ్లు!


‘ఆర్ ఆర్ ఆర్’ (RRR) సినిమా మరో రెండు నెలల్లో మన ముందుకు రానుంది. కానీ, ఈ సినిమా ప్రకటన వచ్చి అప్పుడే నాలుగేళ్లు కావొస్తోంది. నవంబర్ 18, 2017న రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి కూర్చున్న ఫోటోని షేర్ చేశారు. అలా ఈ సినిమా పని మొదలైంది. మధ్యలో రెండు కరోనా కాలాలను చూసింది ఈ టీం. ఎన్నోవాయిదాల తర్వాత షూటింగ్ ని పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది.

ఈ సినిమా టీం నాలుగేళ్ళ కిందటి రాజమౌళి ట్వీట్ ని షేర్ చేస్తూ… మరోసారి దీనికి ఎప్పుడు బీజం పడిందో అభిమానులకు గుర్తు చేసింది. నాలుగేళ్ల క్రితం ఈ ట్వీటొచ్చింది… మూడేళ్ళ కిందట షూటింగ్ మొదలైంది… మరో 50రోజుల్లో మీ ముందుకొస్తోంది అని చెపుతూ అభిమానులని సిద్ధంగా ఉండమని చెప్తోంది “ఆర్‌ఆర్‌ఆర్‌” టీమ్.

రాజమౌళి సినిమా విడుదల అంటే ఒక ఈవెంట్. మార్కెటింగ్ అద్భుతంగా చేస్తుంది ఆయన టీం. ఈ సారి కూడా అలాంటిది పెద్ద ప్లాన్ సెట్ చేశారు ‘ఆర్ ఆర్ ఆర్’ మేకర్స్. ఒక్క ‘సై’ తప్ప, రాజమౌళి కెరీర్ లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్లే. మరి, ‘ఆర్ ఆర్ ఆర్’ ఏ రేంజ్ హిట్టవుతుందో చూడాలి. ఈ సినిమాకి దాదాపు 600 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. శాటిలైట్, థియేటర్, డిజిటల్…. ఇలా అన్నివిధాలా అమ్మేసి నిర్మాత మంచి లాభాల్లో ఉన్నారు.

రాజమౌళి సినిమాకి ఎంత బిజినెస్ అవగలదో ఈ సినిమా చూపిస్తోంది.

"ఆర్ ఆర్ ఆర్" ఎంత కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు?

  • బాహుబలి 1కి సమానంగా (41%, 16 Votes)
  • బాహుబలికి కన్నా చాలా తక్కువగా (38%, 15 Votes)
  • బాహుబలి 2కి మించి (21%, 8 Votes)

Total Voters: 39

Loading ... Loading ...
Advertisement
 

More

Related Stories