బాయ్ఫ్రెండ్, పిన్నితో తిరుమలకు

Janhvi Kapoor


జాన్వీ కపూర్ కి భక్తి ఎక్కువే. ముఖ్యంగా తిరుమల వెంకన్న అంటే ఎనలేని భక్తి. ఆమె తల్లి శ్రీదేవి కూడా తరుచుగా తిరుమలకి వేంకటేశ్వరుడిని దర్శించుకునేవారు. జాన్వీ కూడా ఏడాదిలో మూడు, నాలుగు సార్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజలు చేస్తుంది.

Advertisement

కొత్త ఏడాది 2024లో మొదటి దర్శనం ఈ రోజు చేసుకొంది. అంతే కాదు, దర్శనానికి వెళ్లేముందు సంపద్రాయ చీరకట్టులో దిగిన తన ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలు షేర్ చేసింది. వాటికి “గోవిందా గోవిందా” అనే క్యాప్సన్ కూడా తెలుగులో రాసింది.

శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియా ముందుకొచ్చింది. ఐతే ఆమె ఫోటోలు తీసేందుకు కెమెరామెన్ లు ప్రయత్నిస్తే ఆమెతో పాటు దర్శనానికి వచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ మీడియాని అడ్డుకున్నారు. జాన్వీ కపూర్ తో ఆమె పిన్ని, ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి కూడా వారితో ఉంది.

జాన్వీ కపూర్ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ గురించి “కాఫీ విత్ కరణ్ 8” టాక్ షోలో మాట్లాడింది. ఏదైనా సమస్య వచ్చినా, ఆపదలో తాను వెంటనే కాల్ చేసేది ముగ్గురికే తెలిపింది. ఆ ముగ్గురిలో ఒకరు శిఖర్ అని చెప్పింది. మిగతా ఇద్దరు ఆమె నాన్న, ఆమె చెల్లెలు ఖుషి. తండ్రి, సిస్టర్ లతో సమానంగా శిఖర్ కి ప్రాధాన్యం ఇచ్చింది. వీరి పెళ్లి గురించి అందుకే వార్తలు వస్తున్నాయి.

ALSO READ: నా కళ్ళు కాదు ఇంకేవో చూస్తారు: జాన్వీ

Advertisement
 

More

Related Stories