హృతిక్ కి కంగన కౌంటర్


బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ని జుడిసియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు. ఐతే, శుక్రవారం బెయిల్ పిటిషన్ విచారణకు అంగీకరించింది. మరోవైపు, ఆర్యన్ ఖాన్ కి హృతిక్ లెటర్ రాశాడు. “జీవితంలో ప్రతిదీ ఒక పాఠమే. మనం ఊహించనిది జరుగుతాయి జీవితంలో. అధైర్యపడకు. ఈ సమస్యని ధైర్యంగా ఎదుర్కొని బయటపడుతావు. నిజమైన హీరోగా నిలబడుతావు…,” ఇలా ధైర్య వచనాలు పలికారు హృతిక్.

ఇన్ స్టాగ్రామ్ వేదికపై ఇలా రాశారు హృతిక్. ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు హీరోలు, నటీమణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హృతిక్ ఇలా పోస్ట్ చేసిన క్షణాల్లోనే కంగనా స్పందించింది.

“ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా మాఫియా బాబు ఒకరు దిగారు. మనం తప్పులు చేస్తాం. వాటిని సరిద్దికోవాలి. కానీ వాటిని గొప్పగా చూపొద్దు. ఆర్యన్ చేసిన దాని గురించి మాట్లాడను కానీ అతను ఏ తప్పు చెయ్యలేదు అనుకునేలా ఒక భ్రమ కల్పించొద్దు,” అంటూ హృతిక్ కి కౌంటర్ ఇచ్చింది. చేసిన పనులకు ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో ఆర్యన్ తెలుసుకునేలా హృతిక్ లాంటి వారు ప్రవర్తించడం లేదని అంటోంది కంగన.

హృతిక్, కంగన మధ్య గొడవలు ఈనాటివి కావు. హృతిక్ తనని ప్రేమించి మోసం చేశాడని ఆమె గతంలో ఆరోపించింది. హృతిక్ మీద కోపంతోనే ఆమె మొత్తం బాలీవుడ్ టాప్ హీరోలపై కక్ష పెట్టుకుందని అంటారు. అందుకే, ఆర్యన్ కి మద్దతుగా పోస్ట్ హృతిక్ వెయ్యగానే ఈమె గయ్యిన లేచింది.

మరోవైపు, ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకం అని ఎన్సీపీకి చెందిన నేత నవాబ్ మాలిక్ ఆరోపిస్తున్నారు. తన ఆరోపణలకు బలంగా ఆయన కొన్ని వీడియోలు వదిలారు. అందులో ఇద్దరు బీజేపీ నాయకులు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో కలిసి విచారణ జరుపుతున్నట్లు ఉంది. అలాగే, ఆర్యన్ ఖాన్ ని ఎన్సీబీ ఆఫీస్ కి తీసుకురావడంలో ఒక బీజేపీ నేత ముఖ్య పాత్ర పోషించినట్లు కనిపిస్తోంది.

Advertisement
 

More

Related Stories