కీర్తికి అర్థం కాని కథ

నాని సరసన కీర్తి సురేష్ ఇంతకుముందే ‘నేను లోకల్’ వంటి చిత్రంలో నటించింది. ఇప్పుడు మరోసారి ‘దసరా’ చిత్రంలో హీరోయిన్ గా దర్శనమిస్తోంది. ఐతే, ఈ సినిమా కథ ఆమెకి మొదటిసారి అర్థం కాలేదంట.

కీర్తి సురేష్ కి కథ చెప్పేందుకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వెళ్ళాడట. ఆమెకి మూడు గంటల పాటు ఆ దర్శకుడు కథ నేరేట్ చేశాడు. ఆమె విని అతన్ని పంపించేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నాని ఆమెకి ఫోన్ చేసి కథ ఎలా ఉందని అడిగితే ఏమి కథ అని సమాధానం ఇచ్చిందట. దాంతో, డౌట్ వచ్చి నాని శ్రీకాంత్ కి ఫోన్ చేసి నువ్వు కీర్తికి నిజంగా కథ చెప్పావా అని అడిగాడట. అతను అవును అని జవాబు ఇచ్చాడు.

మళ్లీ ఆమెకి ఫోన్ చేసి ఓ అబ్బాయి వచ్చి మూడు గంటలు కథ చెప్పాడు కదా ఆ కథ ఎలా అనిపించింది అని అడిగాడు నాని. అవును కానీ నాకు అది అర్థం కాలేదు అని సమాధానం ఇచ్చిందట కీర్తి సురేష్. శ్రీకాంత్ ఓదెల పూర్తిగా తెలంగాణ యాసలో చెప్పేసరికి ఆమెకి అర్థం కాలేదని తర్వాత వీళ్ళు గ్రహించారు. ఆ తర్వాత మరోసారి ఆమెకి ఇంగ్లిష్ లో కథ చెప్పడంతో ఆమె ఒకే చెప్పి ‘దసరా’ ఒప్పుకొంది.

ఈ సినిమాలో ఆమె వెన్నెల అనే సింగరేణి యువతిగా కనిపిస్తుంది.

నాని మొదటిసారి తెలంగాణ యాసలో డైలాగులు చెప్పాడు. కీర్తి పాత్ర కూడా అంతే.

ALSO READ: Dasara trailer: Nani in a ferocious avatar

ఇప్పుడు ఈ సినిమా తనకెంతో ఇష్టమని చెబుతోంది కీర్తి. ఈ ట్రైలర్ తాజాగా విడుదలయింది. ‘దసరా’ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.

 

More

Related Stories