మన్సూర్ పై కుష్బూ మండిపాటు

Khsubu

మన్సూర్ అలీ ఖాన్ – త్రిష వివాదం ఇంకా చల్లారలేదు. మన్సూర్ అలీ ఖాన్ పై తమిళనాడులో కేసు నమోదైంది. ఆయన్ని అరెస్ట్ చెయ్యాలనే డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు, తమిళ సినిమా ఇండస్ట్రీ మొత్తం అతను క్షమాపణ చెప్పాల్సిందే అంటోంది. కానీ మన్సూర్ అలీ ఖాన్ మాత్రం ససేమిరా అంటున్నాడు.

ఇప్పుడు కుష్బూ కూడా మండిపడింది. త్రిష గురించి కామెంట్ చేసిన వీడియో ఇంటర్వ్యూలోనే మన్సూర్ కుష్బూని కూడా (సినిమాల్లో) రేప్ చేసినట్లు చెప్పుకున్నాడు.

ALSO READ: సారీ చెప్పనంటున్న మన్సూర్!

“మన్సూర్ … నువ్వు సారీ చెప్పితే నీకు నీ కుటుంబ సభ్యుల్లోనే గౌరవం పెరుగుతుంది. త్రిష విషయంలో పట్టింపులకు పోతే ఆమెకి ఏమి నష్టం లేదు. నీ మనస్తత్వమేంటో జనాలకు తెలిసింది. ఆడవాళ్ళను గౌరవంగా చూడడం నేర్చుకో,” అని కుష్బూ మండిపడింది.

ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో మన్సూర్ తాను సినిమాల్లో కుష్బూ కుట్టిని, రోజా కుట్టిని రేప్ చేశాను అని గర్వంగా చెప్పుకున్నాడు. కానీ త్రిషని కనీసం బెడ్ రూమ్ లోకి ఎత్తుకెళ్లే అవకాశం రాలేదు అని అన్నాడు.

Advertisement
 

More

Related Stories