
కుష్బూ ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగులో మంచి విజయాలు అందుకున్నారు. కానీ, ఇటీవల ఆమె క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఏ సినిమాలో నటించినా అది డిజాస్టర్ అవుతోంది. ఆమె తెలుగులో నటించిన మూడు చిత్రాలు అట్టర్ ఫ్లాప్.
ఆమె ఖాతాలో తాజా ఫ్లాప్… రామబాణం. ఈ సినిమాలో ఆమె గోపీచంద్ కి జగపతిబాబుకి భార్యగా, వదినగా నటించారు. ‘రామబాణం’ గోపీచంద్ కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్.
‘అజ్ఞాతవాసి’తో ఆమె కొత్త ఇన్నింగ్స్ మొదలైంది టాలీవుడ్ లో. అది ఘోరమైన ఫ్లాప్. ఇక శర్వానంద్, రష్మిక జంటగా రూపొందిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో ఆమె రష్మికకి తల్లిగా నటించారు. అదీ ఫ్లాప్.
ALSO READ: A disappointing opening weekend for Ramabanam and Ugram
ఖుష్బూ నటిగా ఎంట్రీ ఇచ్చింది తెలుగులోనే. వెంకటేష్ మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’లో ఆమె హీరోయిన్ గా అరంగేట్రం చేశారు. అది హిట్ ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించి విజయం అందుకున్నారు. ఇక క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం ఆమె ‘యమదొంగ’తో తెలుగులోకి రంగప్రవేశం చేశారు. అది హిట్టే. కానీ ఇప్పుడు మాత్రం ఆమెకి అన్నీ ఫ్లాపులు. వరుసగా మూడు చిత్రాలు బోల్తా కొట్టడం విశేషం