‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల

10th Class Diaries

దర్శకుడి ఊహను అర్థం చేసుకుని… అంతే అందంగా ప్రేక్షకులకు తన కెమెరా కంటితో చేరవేసేది ఛాయాగ్రాహకులే. సినిమా మేకింగ్‌లో సినిమాటోగ్రాఫర్ గా ఎంతో పేరు సంపాదించినా ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఛాయాగ్రాహకుడిగా ఆయనకిది 50వ చిత్రం. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఫ‌స్ట్‌లుక్‌ను క్రిష్ జాగర్లమూడి ఈ రోజు విడుదల చేశారు. శ్రీనివాసరెడ్డి,

“విజయదశమికి మా సినిమా టైటిల్ వెల్లడించాం. చాలామంది ఫోన్లు చేసి ‘టెన్త్ క్లాస్ డైరీస్’ అనగానే… ఒక్కసారి మా టెన్త్ క్లాస్ రోజులు గుర్తు చేసుకున్నామన్నారు. ప్రేక్షకులందరినీ నోస్టాల్జియాలోకి తీసుకువెళ్లే చిత్రమిది. ఈ డిసెంబ‌ర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం” అని అన్నారు నిర్మాతలు అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం.

“కమర్షియల్ హంగులతో పాటు కొత్తదనం ఉన్న సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ప్రతి ఒక్కరికీ టెన్త్ క్లాస్ రోజులను గుర్తు చేసే విధంగా… స్నేహం, ప్రేమ, ఆకర్షణ, ఆకాంక్షలను స్పృశిస్తూ తీసిన చిత్రమిది, ” అని అన్నారు ‘గరుడవేగ’ అంజి.

Advertisement
 

More

Related Stories