తుస్సుమనిపించిన మలైక!


గురువారం ఉదయం మలైక పెట్టిన ఒక పోస్ట్ కలకలం రేపింది. “అవును ఓకే చెప్పాను…” అంటూ ఎంగేజ్ మెంట్ రింగుల ఈమోజీలు పెట్టింది. సిగ్గుపడుతున్న ఫోటో ఒకటి జతపరిచింది. అంతే, 49 ఏళ్ల మలైకకి పెళ్లి అంటూ ప్రచారం ఊపందుకొంది.

ALSO READ: Malaika’s “I Said Yes” post sparks wedding rumors

37 ఏళ్ల తన బాయ్ఫ్రెండ్ అర్జున్ కపూర్ ని పెళ్లి చేసుకునేందుకు 49 ఏళ్ల డైవోర్సీ మలైక సిద్ధమైంది అని మీడియా అంతా వార్తలు పబ్లిష్ చేసింది. సాయంత్రానికి సీన్ మారింది. తూచ్ అంటూ ఈవెనింగ్ ఆమె మరో ఫోటో, మరో క్యాప్సన్ పెట్టింది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ కి ఎస్ చెప్పాను …. ఆ బ్రాండ్ తో నా ఎంగేజ్ మెంట్ అంటూ అసలు విషయం బయటపెట్టింది. అంటే ఇది బ్రాండ్ ప్రమోషన్ అన్నమాట.

జనం తన పెళ్లి గురించి మాట్లాడుకోవాలని అలా పెట్టింది. చివరికి బ్రాండ్ ప్రమోషన్ అని తుస్సుమనిపించింది. ఆ బ్రాండ్ కి బాగానే ప్రచారం దక్కింది.

49 ఏళ్ల మలైకకి 20 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. మొదటి భర్త నుంచి మూడేళ్ళ క్రితం విడిపోయింది. భర్త ఉండగానే అర్జున్ కపూర్ తో డేటింగ్ షురూ చేసింది. ఇప్పుడు ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అందుకే, వీరి పెళ్లి గురించి అంతగా ప్రచారం జరుగుతోంది.

 

More

Related Stories