నాలుగేళ్ల తర్వాత ఐటెం సాంగ్

ఒకప్పుడు ఆమె ఐటెం సాంగ్స్ కి పెట్టింది పేరు. బాలీవుడు, టాలీవుడ్ లలో ఎన్నో ఐటెం సాంగ్స్ చేసింది. ఐతే గత నాలుగేళ్లుగా ఆమె అలాంటి వాటికి దూరమైంది. మళ్ళీ ఇప్పుడు ఆమె వెండితెరపై తన డ్యాన్స్ హొయలు చూపించే అవకాశం వచ్చింది.

నాలుగేళ్ల తర్వాత ఆమె ఒక ఐటెం సాంగ్ లో నటిస్తోంది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న ‘యాక్షన్ హీరో’ (An Action Hero) అనే సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేస్తోంది. 49 ఏళ్ల భామతో ఐటెం సాంగ్ చేయించడం అంటే స్పెషల్ అనే చెప్పాలి కదా.

ఆమె గతంలో ‘చయ్యా చయ్యా (దిల్ సి), ‘కాల్ ధమాల్’ (కాల్), మున్ని బద్నామ్ (దబాంగ్), అనార్కలి డిస్కో చలి (హౌస్ ఫుల్ 2) వంటి పాపులర్ ఐటెం సాంగ్స్ లో కవ్వించింది. నర్తించింది. తెలుగులో కూడా ‘కెవ్వు కేక’ (గబ్బర్ సింగ్), ‘రాత్రయినా’ (అతిధి) ఐటెం సాంగ్స్ చేసింది మలైక.

ఇటీవల ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అందచందాల ఆరబోసే ఫోటోలు, ప్రియుడు అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాల్ తో ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

ALSO READ: తుస్సుమనిపించిన మలైక!

 

More

Related Stories