‘మళ్ళీ పెళ్లి’ ఆటంబాంబ్: నరేష్

- Advertisement -

‘మళ్ళీ పెళ్లి’ ఇప్పటికే చాలా బజ్ క్రియేట్ చేసింది. విడుదల తర్వాత ఒక ఆటంబాంబ్ లా పేలుతుంది అని అంటున్నారు నరేష్. ఈ సినిమాలో ఆయన హీరో. ఆయనే నిర్మాత.

నటుడిగా ఆయన వయసు 50 ఏళ్ళు. “పండంటి కాపురం మొదటి సారి మేకప్ వేసుకున్నాను. ‘నాలుగు స్తంభాలాట’తో హీరో అయ్యాను. నటుడిగా 50 ఏళ్ళు. విజయ్ కృష్ణ మూవీస్ అనే బ్యానర్ ని స్థాపించి 50 ఏళ్ళు. సరిగ్గా ఇదే టైంలో మళ్ళీ కథానాయకుడిగా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేయడం యాదృచ్ఛికం, అదృష్టం,” అని అన్నారు నరేష్.

“నటుడిగా, నిర్మాతగా ఇది పెద్ద ప్రయోగం. నిర్మాతగా చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను,” అని నమ్మకంగా చెప్తున్నారు నరేష్.

పవిత్రతో తన బంధం పవిత్రం అని ముగించారు.

ALSO READ: Pavitra Lokesh: Mahesh and Namrata accepted me as their family member

 

More

Related Stories